దళపతి విజయ్ డ్యూయెల్ రోల్ లో నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం )తమిళ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.తమిళనాడులో నాలుగు రోజుల్లో 100 కోట్లకుపైగా వసూళ్లను సాధించి సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తోంది.ఈసినిమా తెలుగు,హిందీలో కూడా విడుదలకాగా నార్త్ లో 4రోజుల్లో అన్ని వెర్షన్లు కలుపుకుని 13.49కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లోనూ ది గోట్ సూపర్ వసూళ్లను రాట్టుకుంటుంది.4రోజుల్లో 100కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకొని బ్రేక్ ఈవెన్ ను చేరువైయ్యింది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.ఓవరాల్ గా ది గోట్ నాలుగు రోజుల్లో 288కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 100కోట్లు రాబట్టాల్సివుంది.ఇప్పట్లో పెద్ద సినిమాల విడుదలేకపోవడంతో లాంగ్ రన్ లో టార్గెట్ చేరుకోవడం సాధ్యమే.
వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈసినిమాలో స్నేహ,మీనాక్షి చౌదరి,ప్రశాంత్,ప్రభుదేవా,అజ్మల్,లైలా,యోగిబాబు,వీటీవీ గణేష్,జయరామ్ కీలక పాత్రలు పోషించారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మించింది.
ఇక విజయ్ మరో సినిమా మాత్రమే చేసి సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు.ఆతరువాత పొలిటికల్ గా బిజీ కానున్నాడు.విజయ్ చివరి చిత్రాన్ని ఖాకి ఫేమ్ వినోత్ తో చేయనున్నాడు.కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానుంది.త్వరలోనే అఫీషయల్ గా అనౌన్స్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: