ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర.దాదాపు 6ఏళ్ళ తరువాత సోలో హీరోగా బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు.దాంతో దేవర ఫై అంచనాలు భారీగా వున్నాయి.ఆ అంచనాలకు తగ్గేట్లే ఈసినిమానుండి వచ్చిన టీజర్,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక నిన్న కీలకమైన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ముంబై లో ఈవెంట్ జరిపారు.దీనికి ఎన్టీఆర్ తోపాటు డైరెక్టర్ కొరటాల శివ,హీరోయిన్ జాన్వీ కపూర్,విలన్ గా నటించిన సైఫ్ అలీఖాన్ హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర అదిరిపోనుందని ముఖ్యంగా చివరి 40నిమిషాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పి అంచనాలు మరింతగా పెంచేశాడు.ఇంతకుముందెన్నడూ చూడని యాక్షన్ పార్ట్ వుండనుందట.ఇక నిన్న రిలీజైన ట్రైలర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ట్రైలర్ లో దాదాపు స్టోరీ రివీల్ చేశారు.అయితే చివర్లో ఊహించని ట్విస్ట్ ఉంటుందని ఈ ట్విస్టే సెకండ్ పార్ట్ లీడ్ అని అంటున్నారు.
ఓవరాల్ గా ప్రమోషనల్ కంటెంట్ అయితే క్లిక్ అయ్యింది. సినిమాకు హిట్ టాక్ వస్తే రికార్డులు తిరగరాయడం ఖాయం.ఆల్రెడీ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేశాయి.సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందే ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మాములు విషయం కాదు.రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.యువసుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ 27న దేవర ఫస్ట్ పార్ట్ థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: