రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారు అరుదుగా ఉంటుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. ‘బాణం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అందరి హీరోల్లా కేవలం కమర్షియల్ పంథాలో కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చివరిసారిగా 2018లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’ చేసిన ఆయన చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే ‘ప్రతినిధి 2’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చాడు. ఆయన హీరోగా ప్రస్తుతం ‘సుందరకాండ’ అనే ఫామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఇది రోహిత్ కెరీర్‌లో 20వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.
ఇక ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ కూడా మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఇదిలావుంటే, తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ అందించారు మేకర్స్. సుందరకాండ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో రేపు సాయంత్రం ఈ లిరికల్ వీడియో రాబోతోందని వెల్లడించారు.
కాగా ఈ చిత్రాన్ని సందీప్ పిక్చర్స్ ప్యాలెస్ అనే నూతన నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా.. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చాలావరకు కొత్త వాళ్లే నటిస్తున్నారు. ఇక త్వరలోనే సుందరకాండ థియేటర్లలో విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























