జనక అయితే గనక సెకండ్ సింగిల్ అప్‌డేట్

Janaka Aithe Ganaka Second Single Update

అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే జనక అయితే గనక ట్రైలర్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్‌తో సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. అలాగే ‘నా ఫేవరెట్ నా పెళ్ళాం’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

ఈనెల 12న జనక అయితే గనక నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ‘నువ్వే నాకు లోకం’ అంటూ సాగే హార్ట్ టచింగ్ మెలోడియస్ సాంగ్‌ రిలీజ్ కానుందని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12వ తేదీన ప్రేక్షకులముందుకు రానుంది.

ఇక ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి గ్రాండ్‌గా నిర్మించారు.

విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్‌ కల్యాణ్‌ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అరసవిల్లి రామ్‌కుమార్‌, కాస్ట్యూమ్ డిజైనర్‌గా భరత్‌ గాంధీ పనిచేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ యుఎస్‌ఏ థియేట్రికల్ హక్కులను హీరో సుహాస్ స్వయంగా చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.