టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా 37వ చిత్రం (#శర్వా37) తెరకెక్కుతోంది. ‘సామజవరగమన’ సినిమాతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో శర్వానంద్ సరసన స్టార్ యాక్ట్రెస్ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్. నేడు సంయుక్త జన్మదినం సందర్భంగా శర్వా 37 నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది. ఇందులో తను ‘దియా’ అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేసారు. అయితే ఈ సినిమాలో సాక్షి వైద్య మరో కథానాయికగా నటిస్తోంది.
ఈ ఆకర్షణీయమైన పోస్టర్‌లో సంయుక్తా మీనన్ సంప్రదాయ శాస్త్రీయ నృత్య దుస్తులలో అబ్బురపరిచేలా ఉంది. ఆమె రెండు చేతుల్లో రెండు దీపాలను పట్టుకుని, నాట్య భంగిమలో ఉండటం గమనించొచ్చు. ఇక ఈ సినిమా కోసం టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూరుస్తుండగా.. జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీని పర్యవేక్షిస్తున్నారు. అలాగే భాను బోగవరపు కథ అందించగా, నందు సావిరిగాన డైలాగ్స్ రాశారు. బ్రహ్మ కడలి కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: