కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

దేవర.. అప్పుడే రికార్డుల వేట మొదలెట్టేశాడు

Devara Becomes The First Indian Movie For Fastest 1Million Dollars Pre Sales in North America

దేవర.. అప్పుడే రికార్డుల వేట మొదలెట్టేశాడు

Devara Becomes The First Indian Movie For Fastest 1Million Dollars Pre Sales in North America

Devara Becomes The First Indian Movie For Fastest 1Million Dollars Pre Sales in North America

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'దేవర'. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. విడుదలకు మరికొన్ని రోజులే ఉండటంతో దేవర టీమ్ ప్రమోషన్స్‌పై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఫియ‌ర్, చుట్ట‌మ‌ల్లే, దావుడి సాంగ్స్‌కు, టీజ‌ర్‌ విడుదల చేయగా వీటికి ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్‌ వచ్చింది.

దీంతో తారక్ అభిమానులు స‌హా అంద‌రూ ఎంతో ఆతృత‌గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు జూనియర్ కూడా దేవర ప్రమోషన్స్‌లో జోరు పెంచాడు. దర్శకుడు కొరటాల శివతో కలిసి ముంబై వెళ్లి 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ మరియు బాలీవుడ్ డైరెక్టర్ 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ వంటి పలువురు సెలబ్రీటీలను కలుసుకుంటున్నారు.

ఇక ఈ సాయంత్రం 'దేవర: పార్ట్ 1' థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ తరుణంలో ఇంకా మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాకుండానే అప్పుడే దేవర రికార్డుల వేట మొదలుపెట్టేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటికే యూఎస్‌లో ప్రీ సేల్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రీ సేల్స్‌లో దేవర దూకుడు చూపిస్తున్నాడు. తాజాగా 1 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ మార్క్ అందుకుంది ఈ సినిమా.

దీంతో మూవీ ట్రైలర్ రిలీజ్ కాకుండానే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది దేవర. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అయితే చిత్రం విడుదలకు ఇంకా 17 రోజుల సమయం ఉన్నందున మున్ముందు మరిన్ని రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి. కాగా హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా దేవర ఓవర్సీస్‌లో విడుదలవుతుండగా.. యూఎస్ఏలో ప్రత్యంగిర సినిమాస్ రిలీజ్ చేస్తోంది.

ఇక దేవర చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. భైరా అనే ప్రతినాయకుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో కనిపించనున్నారు. అలాగే ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. కాగా ఈ మూవీకి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఈ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ హై యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్