సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రీసెంట్ గా ఈసినిమా నుండి పాత్రలను పరిచయం చేశారు.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడని తెలిసిందే.సైమన్ అనే పాత్రలో కనిపించనున్నాడు నాగ్.గత కొద్దీ రోజుల నుండి ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇక ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు నాగార్జున. ఈసినిమాలో తను నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.దాంతో నాగ్ ను లోకేష్ ఎలా చూపించనున్నాడోని ఫ్యాన్స్ లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా రానున్న ఈసినిమాలో నాగార్జున తోపాటు ఉపేంద్ర,శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రజనీ,లోకేష్ కాంబోకి తోడు నాగార్జున కూడా జాయిన్ కావడంతో కూలీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇక ప్రస్తుతం నాగార్జున ,కుబేరలో కూడా నటిస్తున్నాడు.ఇందులో నాగ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.ఆల్మోస్ట్ తన పాత్ర తాలూకు షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశాడు.ధనుష్ హీరో గా నటిస్తుండగా తనకు జోడిగా రష్మిక కనిపించనుంది.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నాడు.ఈఏడాది చివర్లో విడుదలచేయాలనీ చూస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























