గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు భారీ వరదలు పోటెత్తడంతో రెండు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలు జలమయం అయ్యాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాదిమంది ప్రజలు కొన్ని రోజులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు అగ్ర హీరోలు సహా ప్రముఖులు వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందించాడు ప్రముఖ తమిళ నటుడు సిలంబరసన్ (శింబు). రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన తనవంతు సాయంగా రూ.6 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందించనున్నాడు. కాగా తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన ఈ విపత్తుపై కోలీవుడ్ నుంచి స్పందన తెలియజేసిన తొలి వ్యక్తి శింబునే కావడం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: