ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

AP Deputy CM Pawan Kalyan Meets Telangana CM Revanth Reddy

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో వరద సహాయక చర్యల నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పవన్. ఈ సందర్భంగా తాను ప్రకటించిన విరాళానికి సంబంధించిన చెక్కును తెలంగాణ ముఖ్యమంత్రికి అందజేశారు. ఇక పవన్ సహాయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో వారికీ అండగా నిలిచినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ప్రస్తుతం వీరి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.