జనతా గ్యారేజ్ తరువాత డైరెక్టర్ కొరటాల శివ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో లో వస్తున్న చిత్రం దేవర. ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.అందులో భాగంగా ప్రస్తుతం పార్ట్ 1 షూటింగ్ స్టేజ్ లో వుంది.ఇక ఇటీవల ఈసినిమాలో విలన్ గా నటిస్తున్న హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది దేవర టీం.ఇక ఇప్పుడు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కానుంది.ఈనెల 16నుండి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే సినిమా వాయిదా పై మేకర్స్ ఇంతవరకు స్పందించలేదు.అయితే షూటింగ్ చేయాల్సింది ఇంకా చాలా ఉండడం తో వాయిదా తప్పుకపోవచ్చని టాక్.త్వరలోనే రిలీజ్ డేట్ పై దేవర టీం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ వుంది.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో ఈసినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: