వేలంటైన్స్ డే సందర్భంగా.. మిస్టర్ బచ్చన్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

Mr. Bachchan Special Poster Released on Valentine's Day Eve

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటించిన ‘ఈగల్‌’ చిత్రం ఇటీవలే విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతోన్న విషయం తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరుపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం ఆదివారంతో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’లో రవితేజ పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించనున్నారు. రవితేజ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమాగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ నిలుస్తుందని, ఆయన అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మేకర్స్‌ తెలిపారు. అయితే నేడు వేలంటైన్స్ డే సందర్భంగా.. ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది మూవీ టీమ్. మిస్టర్ బచ్చన్ నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. హీరో, హీరోయిన్ ఒకరినొకరు కౌగలించుకుని ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ఇక ఇదిలా ఉండగా.. రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కిక్’ మూవీ త్వరలోనే రీ రిలీజ్‌ కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజకి జోడీగా ఇలియానా నటించగా.. డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ మీడియా రంగంలో నెం.1 గా ఉన్న మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తుండటం గమనార్హం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fifteen =