ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను పొలిటికల్ డ్రామాగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు 2014-19 మధ్య కాలంలో ఆయన.. ‘పవర్ స్టార్’, ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ మరియు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తదితర చిత్రాలను తీసిన విషయం గుర్తుండే ఉంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాలను రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇక ఈ ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ రెండు సినిమాలకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ క్రమంలో ‘వ్యూహం’ సినిమా ఫిబ్రవరి 23న, శపథం చిత్రం మార్చి 1వ తేదీన గ్రాండ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానున్నాయి.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మురం చేశారు. దీనిలో భాగంగా తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్ రామ్ గోపాల్ వర్మ స్టైల్‌లో సాగింది. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ ల పాత్రలను చాలా ఆసక్తికరంగా మలిచారు. కాగా మరికొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చిత్రాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ముందుగా వస్తున్న వ్యూహం చిత్రాన్ని నైజాం ఏరియాలో టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: