రవితేజ కిక్.. రీ రిలీజ్‌కి రెడీ

Ravi Teja's Kick Movie to be Re Release in Theatres on March 1st

టాలీవుడ్‌లో ఇటీవల రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలను మళ్ళీ నేటి టెక్నాలజీని వినియోగించి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరుల చిత్రాలు ఇలా రెండోసారి విడుదలై మంచి కలెక్షన్స్ సాధించిపెట్టాయి నిర్మాతలకు. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా ఒకటి మరోసారి థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. కాగా తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ మీడియా రంగంలో నెం.1 గా ఉన్న మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తుండటం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కిక్’ మూవీ త్వరలోనే రీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రవితేజకి జోడీగా ఇలియానా నటించింది. డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఆ తర్వాత ఇతర భాషలలో సైతం రీ మేక్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దీనిని హిందీలో తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మార్చి 1న ఈ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. కాగా రవితేజ నటించిన ‘ఈగల్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్‌డ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 10 =