స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న చరణ్

ram charan stylish look goes viral

సినిమా సినిమాకు హీరోలు తమ మేకోవర్ ను మార్చుకోవడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి వారిని మెప్పించడానికి అయినా హీరోలు లుక్స్ ను ఛేంజ్ చేయాల్సిందే. ఇక హీరో రామ్ చరణ్ కూడా ఎప్పుడూ కొత్త లుక్స్ ను ట్రై చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా చరణ్ కు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యాడ్ కోసం చరణ్ చాలా స్టైలిష్ గా రెడీ అయ్యాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తో చేసిన తన కొత్త హెయిర్ స్టైల్ లుక్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలను అలీమ్ హకీమ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈఫొటోలు వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.