టైగర్ తరువాత యంగ్ హీరో సందీప్ కిషన్ ,డైరెక్టర్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన.రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం,ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాకు హైప్ క్రీయేట్ అయ్యింది.తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ బజినెస్ కూడా చేసింది.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది అయితే అంత కన్నా ముందే కంటెంట్ మీద వున్న నమ్మకంతో రేపు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను వేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది కొన్ని షోస్ సోల్డ్ అవుట్ అవ్వగా మరి కొన్ని ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నాయి దాంతో మరి కొన్ని షోస్ ను ఆడ్ చేస్తున్నారు.మొత్తానికి పెయిడ్ ప్రీమియర్లకు వస్తున్న రెస్పాన్స్ చూసి భైరవకోన టీం హ్యాపీ అవుతుంది. టాక్ కూడా పాజిటివ్ గా వస్తే సినిమాకు మరింత హెల్ప్ అవ్వనుంది.సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాలో కావ్య థాపర్,వర్ష బొల్లమ్మ హీరోయిన్లు గా నటించగా శేఖర్ చంద్ర సంగీతం అందించాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈసినిమాను నిర్మించాడు.ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈసినిమాను విడుదలచేస్తున్నాడు.
ఇక చాలా రోజుల నుండి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు సందీప్ కిషన్.అయితే ఈసారి భైరవకోన తనకు కావల్సిన హిట్ ఇస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు ఈహీరో.మరి ఈసినిమా సందీప్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: