కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 161

rahul ravindran interesting comments on OG movie
సినిమా వార్తలు

ఓజీ పై రాహుల్ రవీంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
varun tej update on game changer movie
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ పై వరుణ్ అప్ డేట్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఈసినిమా కొత్త షెడ్యూల్ నేడు హైద్రాబాద్ లో మొదలైనట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
v i anand got another chance in ak entertainments banner
సినిమా వార్తలు

సేమ్ బ్యానర్ లో మరో సినిమా ఛాన్స్

ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా వంటి డిఫరెంట్ కథలతో ఆడియన్స్ ని థ్రిల్ చేసిన డైరెక్టర్ వి ఐ ఆనంద్. రీసెంట్ గా మరోసారి బాక్సాఫీస్ వద్ద తన మార్క్ ను చూపించాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన సినిమా. అడ్వంచరస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఈనెల 16వ తేదీన రిలీజ్ అయిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈసినిమా రిలీజ్ తరువాత కూడా అదే టాక్ తో దూసుకుపోతుంది. కథ, వి.ఐ ఆనంద్ మేకింగ్, విజువల్స్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా డీసెంట్ కలెక్షన్స్ ను అందుకుంటుంది. కేవలం మూడు…

TFN Adminవాట్సాప్
operation valentine movie final strike out now
సినిమా వార్తలు

ఆపరేషన్ వాలెంటైన్ ఫైనల్ స్ట్రైక్ రిలీజ్

ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా మార్చి1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్…

TFN Adminవాట్సాప్
K Viswanath Award Announced For Annapurna College of Film and Media Students
సినిమా వార్తలు

అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్ విద్యార్థులకు విశ్వనాథ్‌ అవార్డు

తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గారు ఒకరు. ఎన్నో చిత్రాలను అద్భుత కళాఖండాలుగా రూపొందించిన ఆయన గతేడాది స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వనాథ్‌ కుటుంబం ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పింది. ఈ మేరకు ‘కాశీనాథుని విశ్వనాథ్‌ అవార్డు’ అనే పేరుతో దీనిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తొలిసారిగా 'అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా'కు చెందిన విద్యార్థులకు విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులు అందజేశారు.

Srikanth Mవాట్సాప్
prabhas and ntr are my favorite heroes says cricketer shami
సినిమా వార్తలు

నా ఫేవరెట్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్

మన తెలుగు హీరోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరును సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే కదా. బాహుబలి తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఆ మార్క్ ను మరింత స్ట్రాంగ్ గా నిలబెట్టారు. అంతేకాదు అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా ప్రపంచ నలుమూలల వరకూవెళ్లింది. దీంతో మన హీరోల రేంజ్ తో పాటు ఫ్యాన్స్ బేస్ కూడా పెరిగిపోయింది. ఇక ఇక్కడ ఓ క్రికెటర్ కూడా తమ ఫేవరెట్ హీరోలు ఎవరంటే మన హీరోల పేర్లు చెబుతున్నాడు. ఆ క్రికెటర్ ఎవరో కాదు వరల్డ్ కప్ లో తమ బౌలింగ్ తో మార్క్ ను క్రియేట్ చేసిన షమి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమినీ ఫేవరెట్ హీరో ఎవరని అడుగగా అందుకు ప్రభాస్, ఎన్టీఆర్ తన…

TFN Adminవాట్సాప్
Tamil Filmmaker Shankar's Daughter Aishwarya Engaged with Assistant Director Tharun Karthikeyan
సినిమా వార్తలు

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్‌మెంట్, ఫోటోలు వైరల్

కోలీవుడ్ స్టార్ శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే త్వరలోనే ఆయన ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా శంకర్ వివాహం మరికొన్ని రోజుల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐశ్వర్య నిశ్చితార్థం తరుణ్ కార్తికేయతో ఘనంగా జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి 18, 2024) చెన్నైలో జరిగిన ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు శంకర్ సన్నిహితుల మిత్రులు కొంతమంది హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్
dhanush 50th movie first look out now
ఫస్ట్ లుక్

ధనుష్ 50 మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ తన సత్తా చూపిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

TFN Adminవాట్సాప్
sithara entertainments acquired bramayugam movie telugu version rights
సినిమా వార్తలు

సితార చేతికి మమ్ముట్టి భ్రమయుగం తెలుగు రైట్స్

మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అది కూడా ఏ సినిమా పడితే ఆసినిమా కాదు. కథా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ హిట్లు కూడా అందుకుంటున్నాాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు భ్రమయుగం. ఈసినిమా అప్ డేట్లతోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. హార్రర్ థిల్లర్ నేపథ్యంలో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ తో ఈసినిమా ను తెరకెక్కించారు. ఈసినిమా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ హిట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Rana Daggubati First Movie Leader Completed 14 Years
సినిమా వార్తలు

నటుడిగా 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న రానా

'బాహుబలి'లో భల్లాలదేవుడిగా ప్రతినాయక పాత్రలో కౄరత్వం ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి నటుడిగా 14 వసంతాలు పూర్తిచేసుకున్నారు. కాగా రానా, ఇండియన్ మూవీ మొఘల్, దివంగత దిగ్గజ నిర్మాత రామానాయుడు మనవడు అన్న విషయం తెలిసిందే. రామానాయుడు పెద్ద కుమారుడు, స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడైన రానా.. బాబాయి విక్టరీ వెంకటేష్ నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆయన నటించిన మొదటి సినిమా 'లీడర్' నేటితో 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
anupama parameswaran thanks to audience
సినిమా వార్తలు

మీ లవ్, సపోర్ట్ కు థ్యాంక్స్

కెరీర్ ప్రారంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుంది టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తన ఉంగరాల జుట్టుతో, అభినయంతో ఎంతో మంది యువతకు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే మధ్యలో కాస్త ఫ్లాప్స్ తో కెరీర్ డల్ అయినా ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాలను చేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉండగా త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Felicitated by NRI's in Los Angeles, USA
సినిమా వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవికి అమెరికాలో ఘన సన్మానం

మెగాస్టార్ చిరంజీవికి అమెరికాలో ఘనంగా సన్మానం జరిగింది. అక్కడి ఎన్నారైలు మరియు మెగాస్టార్ అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ దంపతులు పాల్గొనగా వారిని అభిమానులు పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సత్కరించారు. కాగా మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విష‌యం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ క్రమంలో త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి దేశరాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.

Srikanth Mవాట్సాప్
Operation Valentine Movie Trailer Update
ట్రైలర్ & టీజర్

ఆపరేషన్ వాలెంటైన్ కోసం చరణ్, సల్మాన్

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Actress Sreeleela Visits Tirumala Temple Today
సినిమా వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల

టాలీవుడ్ ప్రముఖ నటి శ్రీలీల గతేడాది స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి', అంతకుముందు రవితేజ 'ధమాకా' చిత్రాలతో సాలిడ్ హిట్స్ అందుకున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'గుంటూరు కారం' సినిమాతో ఆమె మరోసారి ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక గత కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీలీల తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Ravi Teja's Eagle Collects Over 51.4 Cr Gross by the End of 2nd Weekend
బాక్సాఫీస్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈగల్.. 2 వీక్స్ కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈగల్’. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వర హీరోయిన్లుగా నటించగా.. హీరో నవదీప్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
Ooru Peru Bhairavakona movie 3 days collections
బాక్సాఫీస్

ఊరు పేరు భైరవ కోన 3 డేస్ సాలిడ్ కలెక్షన్స్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఈసినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సూపర్ టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈసినిమా కథ, మేకింగ్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Brother's Daughter Dance For Kurchi Madathapetti Song Goes Viral
సాంగ్

కుర్చీ మ‌డ‌తపెట్టి సాంగ్‌.. మ‌హేశ్‌బాబు అన్న కూతురు డ్యాన్స్‌ చూశారా?

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఇటీవలే 'గుంటూరు కారం' చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ మూవీ దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో మహేష్ నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి ఒక్కటి అభిమానులకు పండుగ సంబరాన్ని డబుల్ చేసింది. ఇక ఈ సినిమాలోని 'కుర్చీ మ‌డ‌తపెట్టి' సాంగ్‌ అయితే నెట్టింట విపరీతంగా ట్రెండింగ్ అయింది. ఈ పాటలో హీరో మహేష్ బాబుతోపాటు హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రీలీల అయితే అన్ మ్యాచబుల్ అన్నట్లుగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను థ్రిల్ చేసింది. కాగా ఈ పాటకు దేశవిదేశాల్లోని అనేకమంది రీల్స్ చేయడం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
janhvi kapoor movie with ram charan is confirmed
సినిమా వార్తలు

రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ కన్ఫామ్

ఒకనాటి అందాలతార శ్రీదేవి తెలుగు చిత్ర పరిశ్రమలో తన సినిమాలతో ఎన్నో ఏళ్లు ఏలారు. కేవలం తెలుగు మాత్రమే కాదు తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు చేశారు. ఇక శ్రీదేవి చనిపోయిన తరువాత ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆ కోరిక కూడా తీరిపోనుంది. ఇప్పటికే జాన్వీ కపూర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకోనుండగా ఈఏడాది దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
special treat from Saripodhaa Sanivaaram movie
సినిమా వార్తలు

సరిపోదా శనివారం నుండి వచ్చే శనివారం స్పెషల్ ట్రీట్

గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన నాని ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Nithiin's Robinhood Movie Completes Munnar Schedule
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'రాబిన్‌హుడ్' షెడ్యూల్ అప్‌డేట్

టాలీవుడ్ హీరో నితిన్ ఇటీవలే 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'రాబిన్‌హుడ్‌'. ట్యాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి 'భీష్మ' అనే సినిమా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ఈ క్రమంలో ఈసారి యూనిక్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నితిన్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అలరించనున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్