ఓజీ పై రాహుల్ రవీంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

rahul ravindran interesting comments on OG movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ పవన్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉండటంతో తను చేస్తున్న కొత్త సినిమాల షూటింగ్ లు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలో మోస్ట్ అవైటెడ్ సినిమా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగింది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 27వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓజీ పై ఇప్పటికే చాలా మంది నటీనటులు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో నటుడు కూడా ఈసినిమా గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ నటుడు ఎవరో కాదు రాహుల్ రవీంద్రన్. ఈసినిమాలో రాహుల్ రవీంద్రన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ రవీంద్రన్ ఈసినిమా గురించి మాట్లాడుతూ సుజిత్ తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, ఈసినిమాను చాలా భారీ స్థాయిలో తీస్తున్నారని.. ఈ రోల్ కెరీర్ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు.

ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. అర్జున్ దాస్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.