తెలుగు చిత్ర పరిశ్రమలోని దిగ్గజ దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు ఒకరు. ఎన్నో చిత్రాలను అద్భుత కళాఖండాలుగా రూపొందించిన ఆయన గతేడాది స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ కుటుంబం ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పింది. ఈ మేరకు ‘కాశీనాథుని విశ్వనాథ్ అవార్డు’ అనే పేరుతో దీనిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తొలిసారిగా ‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’కు చెందిన విద్యార్థులకు విశ్వనాథ్ కుటుంబ సభ్యులు అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా విశ్వనాథ్ కుటుంబం ఇద్దరు విద్యార్థులను ఈ అవార్డుతో సత్కరించారు. ఇకపై ప్రతి ఏడాదీ ఈ అవార్డును ఇద్దరు విద్యార్థులకు అందిస్తామని, అలాగే ప్రోత్సాహకంగా 25వేల రూపాయల నగదు కూడా అందిస్తామని వారు తెలిపారు. సినిమాలోని విభిన్న శాఖల్లో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించే వారికి దీనిని అందిస్తామని వివరించారు. కాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు జరిగిన ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్ కుమారుడు, కోడలు నాగేంద్ర, లక్ష్మి, వారి కుమారుడు ప్రణవ్‌లతో పాటు అక్కినేని నాగార్జున, అమల తదితరులు పాల్గొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: