లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఈసినిమా కొత్త షెడ్యూల్ నేడు హైద్రాబాద్ లో మొదలైనట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమా అప్ డేట్ ఇచ్చారు వరుణ్ తేజ్. ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ఈసినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈసినిమా మార్చి1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి ఫైనల్ స్ట్రైక్ ను ఈరోజు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి అడుగుతూ రామ్ చరణ్ గారికి చెప్పండి అన్నా గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఇవ్వమని అని అడుగగా.. దానికి వరుణ్ తేజ్ నిజానికి నేను కూడా రోజూ ఈసినిమా గురించి అడుగుతుంటాను.. ఈరోజే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు.. ఇకపై వరుసగా అప్ డేట్లు వస్తాయి అంటూ తెలిపాడు.
Mega Prince @IAmVarunTej about #GameChanger UPDATE.#RamCharan #VarunTej #OperationValentine #TeluguFilmNagar pic.twitter.com/12u478l8h6
— Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2024
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఈసినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: