యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ సినిమాను భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ ఆచంట,గోపి ఆచంట నిర్మించనున్నారు.ఈరోజు ఈసినిమా లాంచ్ అయ్యింది.ఈకార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్లు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి,పరుశురాం పెట్ల ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The pooja ceremony of #BSS10 was held today and graced by blockbuster directors @harish2you garu & @ParasuramPetla garu 💥💥
Shoot begins June 2nd week❤️🔥@BSaiSreenivas @saagar_chandrak @RaamAchanta #GopiAchanta @14ReelsPlus pic.twitter.com/zU5itvs6VI
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 1, 2023
జూన్ రెండవ వారంలో ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే హీరోయిన్ ఎవరనేది ప్రకటించనున్నారు.కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈసినిమాలో సాయి శ్రీనివాస్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఈఏడాది చివర్లో ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక ఈనెలలో ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి వెళ్లిన సాయి శ్రీనివాస్ కు నిరాశే ఎదురైయ్యింది.ఛత్రపతి టైటిల్ తోనే వచ్చిన ఈసినిమా అనుకున్నంత గా ఆడలేదు.వివి వినాయక్ ఈ రీమేక్ కు దర్శకుడు.మరి సాయి శ్రీనివాస్ తన 10వ సినిమాతోనైనా హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: