నందమూరికళ్యాణ్ రామ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కథతో వచ్చాడు. ఈసినిమాలో మూడు పాత్రలో నటించాడు.. అయితే ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఎంత సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్లిందో అంతే సైలెంట్ గా షూటింగ్ ను జరుపుకుంటూ వచ్చింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ లో ఉండగా తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా దీనితో పాటు బింబిసార సినిమా సీక్వెల్ కూడా లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు. ఇక బింబిసార సీక్వెల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసీక్వెల్ కు విశిష్ట దర్శకత్వం చేయట్లేదట.. కేవలం స్క్రిప్ట్ ను మాత్రమే అందించడానికి ఒప్పుకున్నాడట. స్క్రిప్ట్ వర్క్ లో మాత్రమే తను ఇన్వాల్వ్ అవ్వనున్నాడట. అంతేకాదు ఈసినిమాకు ఎక్కువ బడ్జెట్ కూడా అవుతుందట.. ఈనేపథ్యంలోనే డిస్నీ హాట్ స్టార్ భాగస్వామ్యంతో కళ్యాణ్ రామ్ ఈసినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: