విమానం ట్రైలర్ రిలీజ్-ఎమోషనల్ రైడర్

vimanam movie trailer out now

శివప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వంలో సముద్రఖని ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విమానం. ఈసినిమాలో సముద్రఖని దివ్యాంగుడిగా నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక జూన్ 9వ ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇక ట్రైలర్ కూడా ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంటుంది. విమానం ఎక్కాలనే తన కొడుకు కోరికను తీర్చేందుకు కన్నతండ్రి పడే ఆవేదనను ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. కన్నకొడుకును ఎలాగైనా విమానంలో తీసుకెళ్లేందుకు రూ. 10 వేల కోసం తండ్రి ఉన్న సైకిల్ కూడా అమ్మే సీన్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు సుమతీ ..అందరూ తనను పొందాలని చూస్తారే తప్పా ప్రేమించే వాళ్లు లేరని అనుకంటున్న తరుణంలో తనను మనస్పూర్తిగా ప్రేమించే కోటీని చూసి భావోద్వేగానికి గురవ్వడం.. ఇలాంటి హృదయాన్ని తాకే సినిమా తీశారని అర్థమవుతుంది. ఈసినిమా కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాడు.


కాగా ఈ సినిమాతో మీరా జాస్మిన్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈసినిమాలో అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాాలో అనసూయ సుమతి అనే పాత్రలో నటిస్తుంది. రాహుల్ రామకృష్ణ కోటీ పాత్రలో, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్ ఇంకా డేనియల్ పాత్రలో ధనరాజ్ నటిస్తున్నారు. శివప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌ ఇంకా కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేట్ వ‌ర్క్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాబోతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =