రీసెంట్ గా తెలుగు లో విడుదలై బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది మలయాళం మూవీ 2018.ఆరు రోజుల్లో ఈసినిమా 6కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.తెలుగులో ఈసినిమాను బన్నీ వాస్ రిలీజ్ చేశాడు. ఇక సినిమా సక్సెస్ అవ్వడంతో ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈమీట్ కు ప్రముఖ నిర్మాత ,గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా తమ బ్యానర్ నుండి రానున్న సినిమాల గురించి అల్లు అరవింద్ వాఖ్యానించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కార్తికేయ2 తో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి గీతా ఆర్ట్స్ లో మొత్తం 3సినిమాలు చేయనున్నాడట. అందులో రెండు సినిమాల స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయాయి.ఇక మరొకటి భారీ బడ్జెట్ సినిమా.200-300కోట్ల తో నిర్మించే సినిమా ప్రస్తుతం దీనికి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.ఇక ఈమూడు సినిమాలకు హీరోలు ఎవరన్నది త్వరలో తెలియనుంది.
ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లో చేయనున్నాడు అయితే హీరో ఎవరు అనేది ఇంకా తేలలేదు.ప్రస్తుతం బోయపాటి, రామ్ తో సినిమా చేస్తున్నాడు.ఈసినిమా విడుదల తరువాత బోయపాటి,గీతా ఆర్ట్స్ సినిమా స్టార్ట్ కానుంది అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.త్వరలోనే ఈసినిమాను అఫిషియల్ గా ప్రకటించనున్నారు.ఈసినిమాలో హీరో ఎవరు అనేది కూడా తెలియాల్సివుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: