పెళ్లి చేసుకున్న దసరా డైరెక్టర్

dasara director srikanth odela ties the knot

మొదటి సినిమాతో డైరెక్టర్ గాఇండస్ట్రీలో సాలిడ్ మార్క్ ను వేసుకున్నాడు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల. తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలపెళ్లి చేసుకున్నాడు. తన హోమ్ టౌన్ అయిన కరీనంగర్ జిల్లా గోదావరి ఖని లో పెళ్లి చేసుకొని ఒక ఇంటివాటయ్యాడు. తన మొదటి సినిమా రిలీజ్ అయిన తరువాతే తను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు శ్రీకాంత్. అనుకున్నట్టే దసరా రిలీజ్ అయిన తరువాత పెళ్లి చేసుకున్నాడు. ఇక శ్రీకాంత్ పెళ్లికి టాలీవుడ్ నుండి పలువురు సెలబ్రిటీీలు కూడా హాజరయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు, డైరెక్టర్ అనుదీప్ ఇలా పలువురు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే నాని షూటింగ్ తో బిజీగా ఉండటంతో పెళ్లికి హాజరుకాలేకపోయాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రీకాంత్ దర్శకత్వంలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఈ మూవీ రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్లింది. అంతేకాదు 2023లో టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటిగా దసరా మూవీ నిలిచింది. నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. ఇక శ్రీకాంత్ సెకండ్ ప్రాజెక్ట్ పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే దసరా హిట్ తో పెద్ద పెద్ద బ్యానర్లే శ్రీకాంత్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం తర్వాత ఏ హీరోతో చేస్తాడో..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =