
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 91


7.11 PM రిలీజ్ డేట్ వాయిదా- కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

జపాన్ లో వేరే లెవల్ లో ప్రభాస్ క్రేజ్

బాలీవుడ్ ఎంట్రీ పై యష్ మాస్ రిప్లై

AAA సినిమాస్ లో స్పై ట్రైలర్

యానిమల్ షూటింగ్ కంప్లీట్ చేసిన రష్మిక

ఓజి చేయొద్దనుకున్నా -శ్రీయ రెడ్డి

డీజే టిల్లు తో వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే

చంద్రముఖి2 షూటింగ్ కంప్లీట్

ఇంత మంచి సినిమా లేట్ గా చూశా

100 రోజుల్లో సలార్

10 సినిమాలే చేస్తా.. తర్వాత గుడ్ బై

సెకండ్ మూవీ రైటింగ్ ప్రారంభం

మెగా ప్రిన్సెస్ వచ్చేసింది- ఆనందంలో చిరు

కీడా కోలా నుండి బ్రహ్మీ క్యారెక్టర్ రివీల్

లియో నుండి విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్
ఇళయదళపతి విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే విజయ్ నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా వస్తుంది. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

7.11 PM రిలీజ్ డేట్ వాయిదా- కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
చైతు మాదాల దర్శకత్వంలో సాహస్, దీపికా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 7:11 PM . సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు అలానే టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

మహేష్ ,ప్రభాస్ నాకంటే పెద్ద హీరోలు - పవన్ కళ్యాణ్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ముమ్మడివరంలో జరిగిన వారాహి విజయయాత్రలో సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయ నేపథ్యంలో సాగుతున్న సభలో సందర్భానుసారం మిగితా తెలుగు సినిమా స్టార్ హీరోల గురించి ప్రస్తావించారు.మహేష్ బాబు గారు,ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు నేను వేరే రాష్ట్రాల్లో,దేశాల్లో తెలియకపోవచ్చు కానీ వారు తెలుసు.నాకన్నా ఎక్కువ పారితోషకం తీసుకుంటారు.చిరంజీవిగారు,బాలకృష్ణ గారు,జూనియర్ ఎన్టీఆర్ గారు,రామ్ చరణ్ గారు,అల్లు అర్జున్ గారు వీరంత నాకు ఇష్టం.ఎన్టీఆర్,చరణ్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు.ఇవి చెప్పడానికి నాకు ఎలాంటి ఇగో లేదని పవన్ అన్నారు.అంతేకాదు రాజకీయం,సినిమా ఒక్కటి కాదని…

జపాన్ లో వేరే లెవల్ లో ప్రభాస్ క్రేజ్
ఏ హీరో అయినా ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా అది తమ అభిమానులకు నచ్చాలని, సినీ ప్రేక్షకులు సినిమా చూసి ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే ఎంత రిస్క్ అయినా చేయడానికి ముందుకొస్తుంటారు. అందుకే భాషతో, దేశంతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్థాయి కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ప్రభాస్ కు నేషనల్ వైడ్ గా కాదు.. ఇంటర్నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ను సంపాదించిపెట్టింది. ఆ సినిమా ఏంటో ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగు…

బాలీవుడ్ ఎంట్రీ పై యష్ మాస్ రిప్లై
కన్నడ స్టార్ హీరో యష్ సినీ జర్నీ చూసుకుంటే కె.జి.యఫ్ ముందు కె.జి.యఫ్ తరువాత అని చెప్పుకోవచ్చు. నిజానికి కె.జి.యఫ్ ముందు వరకూ యష్ గురించి కన్నడ ప్రేక్షకులకు తప్పా ఇక్కడ పెద్దగా ఎవరికీ తెలియదు అని చెప్పొచ్చు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కె.జి.యఫ్ తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కె.జి.యఫ్ అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ మేకింగ్, యష్ నటన, స్టైల్, స్వాగ్ ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఈసినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇక ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పార్ట్ 2 కూడా తీసి రిలీజ్ చేశారు. పార్ట్ 2 కూడా సూపర్…

కెప్టెన్ మిల్లర్ షూటింగ్ పూర్తి చేసుకున్న శివ రాజ్ కుమార్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

AAA సినిమాస్ లో స్పై ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్పై. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే క్రమంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది కూడా. జూన్ 22వ తేదీన ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్…

యానిమల్ షూటింగ్ కంప్లీట్ చేసిన రష్మిక
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తను నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ లలో పుష్ప.. ది రూల్ ఇంకా బాలీవుడ్ లో యానిమల్ సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయ. అయితే వీటిలో యానిమల్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది రష్మిక. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా వస్తుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇప్పటి వరకూ లవర్ బాయ్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన రణ్‌బీర్ కపూర్ ఈసినిమాలో మాత్రం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా ప్రీ…

ఓజి చేయొద్దనుకున్నా -శ్రీయ రెడ్డి
పవన్ కళ్యాణ్,సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజి. రీసెంట్ గా స్టార్ట్ అయినా ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంది.ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.త్వరలోనే కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.పవన్ ఈసినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండగా ఆయనకు జంటగా ప్రియాంక మోహన్ నటిస్తుంది.ఇక ఈసినిమాలో శ్రీయ రెడ్డి ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.ఈసినిమా గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.సుజిత్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇది ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయ్యింటుంది అనుకోని నో చెప్పేదాం అనుకున్నా కానీ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాక 5 నిమిషాల్లోనే ఓకే చెప్పాను.కంటెంట్…

డీజే టిల్లు తో వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే
ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీసింహా కోడూరి హీరోగా వస్తున్న సినిమా భాగ్ సాలే. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. అయితే ఈసినిమా షూటింగ్ ను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. రీసెంట్ గానే రిలీజ్ డేడ్ ను కూడా ప్రకటించారు. జులై 7వ తేదీన ఈసినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో ఓ…

చంద్రముఖి2 షూటింగ్ కంప్లీట్
హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది.

ఇంత మంచి సినిమా లేట్ గా చూశా
కమెడియన్ వేణు దర్శకుడిగా మారుతూ వచ్చిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా ఈసినిమా మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించడంతో సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ఒకే జోనర్ కు పరిమితం కాకుండా అందరూ ఈసినిమాను ఆదరించడంతో చిన్న సినిమా అయినా కూడా అంత పెద్ద విజయం సాధించింది. అంతేకాదు ఈసినిమాను చూసి విడిపోయిన కుటుంబాలు కూడా కలిసిపోయాయంటేనే అర్థంచేసుకోవచ్చు ఈసినిమా ఎంత ప్రభావం చూపించగలిగిందో. కేవలం ఇక్కడ మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా తన సత్తా చాటి అవార్డులు కొల్లగొట్టింది.

100 రోజుల్లో సలార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సలార్. పుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. గత ఏడాదే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లినా మధ్యలో ప్రభాస్ ఆది పురుష్ తో బిజీగా ఉండటంతో ఈసినిమా ఇంకా పూర్తి కాలేదు. అయితే దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. మరికొద్ది రోజుల్లో షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. మరోవైపు ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా ఈసినిమా సెప్టెంబర్…

10 సినిమాలే చేస్తా.. తర్వాత గుడ్ బై
తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్లలో లోకేష్ కనగరాజ్ కూడా ఉన్నాడు. తన డిఫరెంట్ మేకింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చిపెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ చేసింది. మానగరం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ మొదటి సినిమాతోనే ఇంపాక్ట్ చూపించాడు. ఇక ఆతరువాత వచ్చిన ఖైదీ సినిమా ఒక్కసారిగా లోకేష్ కనగరాజ్ కు స్టార్ డైరెక్టర్ ను చేసింది. ఇక ఖైదీ సినిమా తరువాత ఏకంగా స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. విజయ్ తో మాస్టర్ సినిమా చేశాడు అయితే ఈసినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మాస్టర్ తరువాత విలక్షణ నటుడు కమల్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్…

మళ్లీ పెళ్లి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మళ్లీ పెళ్లి. ఈసినిమా నరేష్ నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీయడం జరిగింది. ఈసినిమా టీజర్, ట్రైలర్ లతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. రిలీజ్ కు ముందే పలు వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక పైనల్ గా ఎన్నో అంచనాల మధ్య మే 26 వ తేదీన ఈసినిమా ప్రేక్షకులముందుకు రాగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సెకండ్ మూవీ రైటింగ్ ప్రారంభం
జబర్దస్త్ వేణు నుండి డైరెక్టర్ వేణు అనే స్థాయికి ఎదిగాడు కమెడియన్ వేణు. తీసింది ఒక్క సినిమానే అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తించే సినిమాను తీశాడు. పలు సినిమాల్లో కమెడియన్ గా అలానే బుల్లి తెరపై పలు కామెడీ షోల్లో అలరించిన వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. ఈ ఏడాది ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ఎక్కువగా ప్రజాదారణ పొందిన సినిమా జాబిబాతో బలగం సినిమా కూడా ముందు వరుసలో నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా సంచలన విజయం అందించింది. కంటెంట్ ఉంటే ఎంత చిన్న సినిమా అయినా కూడా సక్సెస్ ను అందుకుంటుందని ఆడియన్స్ మరోసారి రుజువు…

మనోహరంగా సునీత, హరితేజ మదన మోహన పాట
యాంకర్ కమ్ నటి హరితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై సీరియల్స్ తో తన ప్రయాణం మొదలుపెట్టిన హరితేజ ఆ తరువాత టీషోస్, యాంకరింగ్ ఇంకా పలు సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తరువాత హరితేజ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందని చెప్పొచ్చు. బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎంట్రీ ఇచ్చి.. తన అటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.

మెగా ప్రిన్సెస్ వచ్చేసింది- ఆనందంలో చిరు
మెగా కుటుంబంలో మరొక ఆనందకరమైన ఘటన చోటు చేసుకుంది. రామ్ చరణ్-ఉపాసనలు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఇక నేడు ఆ రోజు రానే వచ్చేసింది. రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులయ్యారు. ఈరోజు తెల్లవారు జామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈమేరకు అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటన ఇచ్చింది. ఉపాసనకు ఆడ బిడ్డ జన్మించిందని.. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటనలో తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. రామ్ చరణ్ దంపతులకు అభినందనలు తెలియచేస్తున్నారు.

బాలయ్య పాటతో అదరగొట్టిన కాజల్, శ్రీలీల
నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను రిలీజ్ చేయగా.. ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల లుక్‌ని కూడా ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉన్నారు.

కీడా కోలా నుండి బ్రహ్మీ క్యారెక్టర్ రివీల్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత తరుణ్ భాస్కర్ ఈసినిమాతో వస్తున్నాడు. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై ఇప్పటికే క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 29వ తేదీన ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే క్యారెక్టర్ పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈనేపథ్యంలో మొదట బ్రహ్మానందం…