జబర్దస్త్ వేణు నుండి డైరెక్టర్ వేణు అనే స్థాయికి ఎదిగాడు కమెడియన్ వేణు. తీసింది ఒక్క సినిమానే అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తించే సినిమాను తీశాడు. పలు సినిమాల్లో కమెడియన్ గా అలానే బుల్లి తెరపై పలు కామెడీ షోల్లో అలరించిన వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. ఈ ఏడాది ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ఎక్కువగా ప్రజాదారణ పొందిన సినిమా జాబిబాతో బలగం సినిమా కూడా ముందు వరుసలో నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా సంచలన విజయం అందించింది. కంటెంట్ ఉంటే ఎంత చిన్న సినిమా అయినా కూడా సక్సెస్ ను అందుకుంటుందని ఆడియన్స్ మరోసారి రుజువు చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించిన జీవనచిత్రంగా ప్రశంసలను అందుకుంది. అంతేకాదు ఈసినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇచ్చాడు వేణు. తన ట్విట్టర్ ద్వారా సెకండ్ మూవీ రైటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలిపాడు. మరి ఈసినిమా ఏ జోనర్ లో ఉండబోతుంది..? నటీ నటులు ఎవరు? లాంటి విషయాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సింది. మరి బలగంతో మ్యాజిక్ క్రియేట్ చేసిన వేణు ఈసారి ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.
Started…..#2✌🏼#Cinema #writing pic.twitter.com/PTpl7lmKDh
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) June 19, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: