ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా మళ్లీ పెళ్లి. ఈసినిమా నరేష్ నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీయడం జరిగింది. ఈసినిమా టీజర్, ట్రైలర్ లతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. రిలీజ్ కు ముందే పలు వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక పైనల్ గా ఎన్నో అంచనాల మధ్య మే 26 వ తేదీన ఈసినిమా ప్రేక్షకులముందుకు రాగా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటిచారు. జూన్ 23వ తేదీన ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ఇంకా ఈసినిమాలో జయసుధ, శరత్‌బాబు వనిత విజయకుమార్ కీలక పాత్రల్లో నటించగా.. అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా.. అరుల్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా.. జునైద్ సిద్ధిక్ ఎడిటర్ గా.. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశారు. ఈ సినిమాను లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పునః ప్రారంభించి నరేష్ నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: