మెగా ప్రిన్సెస్ వచ్చేసింది- ఆనందంలో చిరు

ram charan and upasana blessed with a baby girl

మెగా కుటుంబంలో మరొక ఆనందకరమైన ఘటన చోటు చేసుకుంది. రామ్ చరణ్-ఉపాసనలు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. ఇక నేడు ఆ రోజు రానే వచ్చేసింది. రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులయ్యారు. ఈరోజు తెల్లవారు జామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈమేరకు అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఒక ప్రకటన ఇచ్చింది. ఉపాసనకు ఆడ బిడ్డ జన్మించిందని.. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటనలో తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో మెగా అభిమానులు అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. రామ్ చరణ్ దంపతులకు అభినందనలు తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తన సంతోోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ కి స్వాగతం.. నీ రాకతో మెగా ఫ్యామిలీలో కొత్త ఉత్సాహం నెలకొంది.. తల్లి దండ్రులుగా రామ్ చరణ్, ఉపాసన.. తాతగా తనకు చాలా గర్వంగా ఉందని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించి అభినంనలు తెలిపాడు. కంగ్రాచ్యూలేషన్స్ చరణ్ అండ్ ఉపాసన. వెల్ కమ్ టు పేరెంట్స్ క్లబ్. మీ బేబీ గర్ల్ తో మీరు గడిపే ప్రతి క్షణం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా మారుతాయి. ఆ దేవుడి మీకు ఎంతో సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశాడు.

కాగా ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.