బాలయ్య పాటతో అదరగొట్టిన కాజల్, శ్రీలీల

kajal aggarwal and sreeleela super dance for balakrishnas superhit song

నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను రిలీజ్ చేయగా.. ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల లుక్‌ని కూడా ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అనిల్ రావిపూడి రీసెంట్ గా బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ మరియు స్టంట్ డైరెక్టర్ వెంకట్ మాస్టర్‌లతో డ్యాన్స్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఎంత వైరల్ అయిందో చూశాం. అనిల్ రావిపూడి తనలో కూడా మంచి డ్యాన్సర్ ఉన్నాడని చూపించాడు. ఇక ఇప్పుడు కాజల్, శ్రీలీల వంతు వచ్చింది. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ నాయుడులోని చిలకపచ్చ కోకా పాటకు కాజల్ అగర్వాల్, శ్రీలీల అదిరిపోయే రేంజ్ లో స్టెప్పులు వేశారు. ఇక ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇద్దరూ హీరోయిన్లు అదరగొట్టారు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + eighteen =