
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 92


జులై నుండి నాన్ స్టాప్ గా గుంటూరు కారం న్యూ షెడ్యూల్

సుధీర్ బాబు న్యూ మూవీ టైటిల్ రిలీజ్

చివరి దశలో విజయ్ లియో

కాజల్ 60 టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కు రెడీ

హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో భగవంత్ కేసరి

క్లైమాక్స్ లో భోళా శంకర్

సౌత్ కొరియా అంబాసిడర్ తో మెగాస్టార్ విందు

శ్రీసింహా భాగ్ సాలే రిలీజ్ డేట్ ఫిక్స్

సలార్ మేనియాకు కు సిద్దం?

VD12 షూటింగ్ మొదలు

ఆదిపురుష్ 1000 ప్లస్ థియేటర్లు.. అన్నీ హౌస్ ఫుల్

సత్యభామ గా వస్తున్న కాజల్
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ తరువాత చందమామ సినిమాతో హిట్ అందుకొని ఆతరువాత కెరీర్ లో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. అలా టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్ . తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ప్రస్తుతం అయితే కాజల్ పలు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. రీసెంట్ గానే…

జులై నుండి నాన్ స్టాప్ గా గుంటూరు కారం న్యూ షెడ్యూల్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. మరోవైపు అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ కావడంతో ఈసినిమావై మహేష్ అభిమానులే పాటు సినీ ప్రేక్షకులు అందరూ కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇక వారి అంచనాలను మరింత పెంచేశాయి రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు కు రిలీజ్ అయిన పోస్టర్ అలానే టైటిల్స్ గ్లింప్స్.

ఆదిపురుష్ 3డేస్ కలెక్షన్స్ -సెన్సేషనల్
ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.వరుసగా మూడు రోజులు 100కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది.మొదటి రోజు 140కోట్లు రాగ రెండో రోజు 100కోట్లు మూడో రోజు మరో 100కోట్ల ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే ఈ రన్ ను ఇలాగే కొనసాగించాల్సి ఉంటుంది. మిగితా భాషల్లో కంటే తెలుగు,హిందీ లో ఈసినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3రోజు ఏకంగా 17కోట్ల షేర్ ను కలెక్ట్ చేయగా హిందీ వెర్షన్ 37కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసింది.

రంగబలి నుండి కలకంటూ ఉంటే మెలోడియస్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే హిట్స్ ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేయడానికే ముందుకొస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో రంగబలి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కామెడీ ప్లస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రికార్డు సృష్టించిన ఆదిపురుష్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతూ ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపిస్తుంది.పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈసినిమా తెలుగుతో పాటు హిందీలో ఎక్స్ట్రార్డినరీ వసూళ్లను రాబడుతుంది.ఇక ఈసినిమా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.ఆదివారం అక్కడ ఆదిపురుష్ 34లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

సుధీర్ బాబు న్యూ మూవీ టైటిల్ రిలీజ్
టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమా రిలీజ్ అవ్వగా అది సరైన విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా హరోంహర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాను ఈ ఏడాది డిసెంబర్ 22న క్రిస్మస్ సెలవుల సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జీ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు…

చివరి దశలో విజయ్ లియో
తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు. ఇక విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న నా రెడీ అనే పాటను రిలీజ్ చేయనున్నారు.

గాండీవధారి అర్జున నుండి సాక్షి వైద్య స్పెషల్ పోస్టర్ రిలీజ్
మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కెరీర్ మొదటినుండీ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానుంది. ఈసినిమా షూట్ మొత్తం విదేశాల్లోనే జరుపుతున్నారు. సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేడ్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమాను…

కాజల్ 60 టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కు రెడీ
టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్ . తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ప్రస్తుతం అయితే కాజల్ పలు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. రీసెంట్ గానే కోస్టీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కాస్త నిరాశనే మిగిల్చింది.

ప్రభాస్ పేరు చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వడానికి
టాక్ తో సంబంధం లేకుండా మరోసారి మొదటి రోజే 100కోట్ల క్లబ్ లో చేరి రెబల్ స్టార్ ప్రభాస్ తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు.బాహుబలి తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది.ఈసినిమా తెలుగులోనే కాదు హిందీలోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక బాహుబలి 2 తో రికార్డులు అన్ని బ్రేక్ చేశాడు.ఈరెండు సినిమాలతో ప్రభాస్ హిందీ మార్కెట్ అక్కడి స్టార్ హీరోల మార్కెట్ సరసన చేరింది.బాహుబలి 2 తరువాత ప్రభాస్ నటించిన సాహో ప్లాప్ టాక్ తో మొదటి రోజు 100కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.ఇప్పుడు తాజాగా ఆదిపురుష్ తో మరోసారి అదే మ్యాజిక్ ను క్రీయేట్ చేశాడు ప్రభాస్.నిన్న విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 140కోట్ల గ్రాస్ వసూళ్లను…

హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో భగవంత్ కేసరి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్లను అందుకోవడంతో బాలయ్య ఫ్యాన్స్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాలకృష్ణ పుట్టినరోజు కు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసినిమాతో హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయానికి వచ్చేశారు.

క్లైమాక్స్ లో భోళా శంకర్
మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

ఆదిపురుష్ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్
ఓంరౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్ నిన్న భారీ స్థాయిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈసినిమా కు ముందు నుండీ ప్రేక్షకుల ఆదరణ ఉండటంతో ఇప్పుడు మంచి టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈసినిమాను చూడటానికి ప్రతిఒక్కరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక దానికి తోడు నేటి టెక్నాలజీని వాడుకుంటూ ఓంరౌత్ ఈసినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. ఆ ప్రభావం టికెట్ బుకింగ్స్ లో చూడొచ్చు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆదిపురుష్ కోసం…

సౌత్ కొరియా అంబాసిడర్ తో మెగాస్టార్ విందు
మెగాస్టార్ చిరంజీవి తాజాగా దక్షిణ కొరియా అంబాసిడర్ తో భేటీ అయ్యారు. తన ఇంటిలో ఆయనకు విందు ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో ఆయనతో దిగిన ఫొటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలోని దక్షిణ కొరియా అంబాసిడర్ చాంగ్ జీబాక్ కు హై టీ సెషన్‌ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. శ్రీనగర్‌లో ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్‌లో రామ్‌చరణ్‌తో కలిసి `నాటు నాటు` పాటకి డాన్సులు వేసినప్పట్నుంచి మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను. దక్షిణ కొరియా, ఇండియా సంస్కృతులు ఒకేలా ఉంటాయని, సినిమా, వినోద రంగానికి సంబంధించిన కల్చర్ కూడా దగ్గరగా ఉంటుందని..కె-పాప్, కె-డ్రామాలు ఇప్పటికే ఇండియన్…

శ్రీసింహా భాగ్ సాలే రిలీజ్ డేట్ ఫిక్స్
మత్తు వదలరా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటిసినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు శ్రీసింహా. ఇక ఆ తరువాత తెల్లవారితే బుధవారం, దొంగలున్నారు జాగ్రత్త సినిమా సినిమాలు చేశాడు. అయితే ఆరెండు సినిమాలు కూడా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. ఇక ఇప్పుడు పలు బిజీగా ఉన్నాడు శ్రీసింహా. అందులో ఉస్తాద్ ఒకటి, భాగ్ సాలే మరొకటి. ఉస్తాద్ సినిమా ఇప్పటికే రిలీజ్ కు సిద్దమవుతుంది. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను వారాహి చలన చిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రజినీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు.

సలార్ మేనియాకు కు సిద్దం?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక వాటిలో ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పవర్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ నుండి వస్తున్న ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో అభిమానులు అయితే ఈసినిమా కోసం మరింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

VD12 షూటింగ్ మొదలు
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా కూడా విజయ్ కు క్రేజ్ తగ్గలేదు. వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక దీనితో పాటు ఇప్పుడు వేరే సినిమాలను కూడా లైన్ లో పెట్టాడు.

ఆదిపురుష్ 1000 ప్లస్ థియేటర్లు.. అన్నీ హౌస్ ఫుల్
ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా ఆదిపురుష్. రామాయణం నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఎప్పటినుండో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్ గా ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు ముందే ఎన్నో ప్రత్యేక విశేషాలను సంతరించుకుంది. ప్రీ రిలీజ్ ఏర్పాట్ల దగ్గర నుండి టికెట్ బుకింగ్స్ లో అలానే ఈసినిమాకు కొంతమంది సెలబ్రిటీలు సైతం ముంకొచ్చి పేద పిల్లలకు సైతం సినిమాను చూపించాలన్న ఉద్దేశంతో టికెట్లను కొనుగోలు చేయడం లాంటి ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి.

లియో ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్లాక్ బాస్టర్ హిట్ విక్రమ్ తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా లియో. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.చిత్రీకరణ కూడా చివరి దశకు చేరుకుంది.ఇక ఈసినిమా నుండి అప్డేట్ వచ్చింది.మొదటి పాట 'నా రెడీ' ఈనెల 22న విడుదలకానుంది.విజయ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 22న ఈసాంగ్ విడుదలకానుందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా సినిమానుండి విజయ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో విజయ్ లుక్ బాగుంది.ఈసినిమాలో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు విజయ్.

విశ్వక్ సేన్ 11 నుండి అంజలి ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.ఇందులో తన 11వ చిత్రాన్ని చైతన్య కృష్ణ డైరెక్షన్ లో చేస్తున్నాడు.ఈసినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది.ఇక ఈసినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో నటిస్తుంది.ఈరోజు అంజలి బర్త్ డే సందర్భంగా సినిమానుండి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అంజలి పాత్ర మాస్ గా వుండనుందని తెలుస్తుంది.ఇందులో అంజలి పాత్ర పేరు రత్నమాల.