మనోహరంగా సునీత, హరితేజ మదన మోహన పాట

Hari Teja and Sunithas Madana Mohana Song Released

యాంకర్ కమ్ నటి హరితేజ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై సీరియల్స్ తో తన ప్రయాణం మొదలుపెట్టిన హరితేజ ఆ తరువాత టీషోస్, యాంకరింగ్ ఇంకా పలు సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తరువాత హరితేజ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైందని చెప్పొచ్చు. బిగ్ బాస్ మొదటి సీజన్ లో ఎంట్రీ ఇచ్చి.. తన అటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉడంగా హరితేజ క్లాసికల్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి తన డ్యాన్స్ తో అలరించింది. హరితేజ నటించిన మదన మోహన అనే పాట రిలీజ్ అయింది. మెలోడియస్ క్వీన్ అయిన సింగర్ సునీత ఈపాటను పాడగా హరితేజ నటించింది. ఇక ఈపాట అయితే అందరినీ ఆకట్టుకంటుంది. సునీత గాత్రం, హరితేజ డ్యాన్స్ అండ్ ఎక్స్ ప్రెషన్స్, విజువల్స్ అన్నీ చాలా ప్లెజెంట్ గా ఉండటంతో ఈపాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చైతన్య జాజ్ దర్శకత్వంలో ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈపాటును మ్యంగో మాస్ మీడియా నిర్మించింది. మరి మంచి మెలోడియస్ గా ఉన్న ఈ పాటను మీరు కూడా విని ఎంజాయ్ చేయండి..

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =