కన్నడ స్టార్ హీరో యష్ సినీ జర్నీ చూసుకుంటే కె.జి.యఫ్ ముందు కె.జి.యఫ్ తరువాత అని చెప్పుకోవచ్చు. నిజానికి కె.జి.యఫ్ ముందు వరకూ యష్ గురించి కన్నడ ప్రేక్షకులకు తప్పా ఇక్కడ పెద్దగా ఎవరికీ తెలియదు అని చెప్పొచ్చు. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కె.జి.యఫ్ తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కె.జి.యఫ్ అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ మేకింగ్, యష్ నటన, స్టైల్, స్వాగ్ ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అన్నీ ఈసినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇక ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పార్ట్ 2 కూడా తీసి రిలీజ్ చేశారు. పార్ట్ 2 కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందరూ యష్ తరువాత సినిమా ఎంటా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతవరకూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు. కె.జి.యఫ్ తరువాత యష్ క్రేజ్ మారిపోయింది కాబట్టి చేస్తే కె.జి.యఫ్ ను మించి సినిమా చేయాలి కాబట్టి ఆ మేరకు సాలిడ్ కథ కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా యష్ బాలీవుడ్ ఎంట్రీపై కూడా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తన బాలీవుడ్ ఎంట్రీ పై యష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాాగా ఓ మీడియాతో ముచ్చటించిన యష్ ను బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందా అడుగగా దానికి సమాధానంగా నేనెక్కడికి వెళ్లను.. అందరినీ నేనున్న చోటుకే రప్పిస్తా అని సాలిడ్ రిప్లై ఇచ్చాడు. దీనితో యష్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చూద్దాం.. యష్ కోసం బాలీవుడ్ మేకర్సే అతని దగ్గరికి వెళతారో? లేదో?
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























