టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్పై. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో నేతాజీ మరణం మిస్టరీని ఛేదించే క్రమంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది కూడా. జూన్ 22వ తేదీన ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ లో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Trailer of #SPY tomorrow @ 11:34 am 💥💥💥 at AAA cinemas #IndiasBestKeptSecret @AbhinavGomatam @sanya_thakurrr @tej_uppalapati @garrybh1988 @vamsipatchipulusu @sricharanpakala pic.twitter.com/f0Kil8oC18
— Nikhil Siddhartha (@actor_Nikhil) June 21, 2023
కాగా ఈసినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నాడు. దర్శకత్వంతో పాటు గారీ ఈసినిమాకు ఎడిటర్ గా కూడా వ్యవహరించనున్నాడు. జూన్ 29వ తేదీన ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: