యానిమల్ షూటింగ్ కంప్లీట్ చేసిన రష్మిక

rashmika mandanna wraps up animal movie shoot

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తను నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ లలో పుష్ప.. ది రూల్ ఇంకా బాలీవుడ్ లో యానిమల్ సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయ. అయితే వీటిలో యానిమల్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది రష్మిక. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా వస్తుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇప్పటి వరకూ లవర్ బాయ్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన రణ్‌బీర్ కపూర్ ఈసినిమాలో మాత్రం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా ప్రీ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది రష్మిక. తన షూట్ పూర్తయిందని తెలియచేసింది రష్మిక. ఈనేపథ్యంలో రణ్ బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా తో పాటు మొత్తం యానిమల్ టీమ్ తో కలిసి దిగిన ఫోటోలని రష్మిక పంచుకున్నారు. ఇప్పటి వరకూ యానిమల్ మూవీ కోసం 50 రోజుల షూటింగ్ చేశాను.. నా పార్ట్ అంతా కంప్లీట్ అయ్యింది.. యానిమల్ టీమ్ ని వదిలేస్తూ ఉంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నా. ఇన్ని రోజులు చాలా ఇష్టంగా వారి తో కలిసి పని చేశాను.. సందీప్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆర్టిస్టులందరికీ చాలా స్వేచ్చనిచ్చారు. రణ్‌ బీర్ కపూర్‌ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.. అనిల్ కపూర్‌తో పనిచేయం అద్బుతమైన అనుభవం అంటూ తెలిపింది రష్మిక.

కాగా ఈసినిమాలో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఆగష్ట్ 11, 2023 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + three =