టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తరువాత తరుణ్ భాస్కర్ ఈసినిమాతో వస్తున్నాడు. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కుతుండటంతో ఈసినిమాపై ఇప్పటికే క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జూన్ 29వ తేదీన ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే క్యారెక్టర్ పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈనేపథ్యంలో మొదట బ్రహ్మానందం పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాాగా తన పాత్రకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో బ్రహ్మీ పాత్రను రివీల్ చేశారు. వరదరాజులు అనే పాత్రలో బ్రహ్మీ నటిస్తున్నాడు. రిలీజ్ చేసిన గ్లింప్స్ లో ఒకప్పుడు వరద రాజులు పేరు చెప్తేనే జిల్లాలు జిల్లాలు భయపడేవి. ఇప్పుడు తన వేలు పట్టుకుని పెరిగిన మనవడు కూడా దేకట్లేడు. ఏంటో ప్రపంచం రోజు రోజుకు వింతగా మారిపోతుందంటూ ఉంటూ ఆయన పాత్ర తీరును తెలిపారు.
Brace yourself to meet the unforgettable Thatha, Mr. Varadharajulu. Character #01.
“Endho… world rozu rozu ki vinthaga maripothundi.” – Thatha #KeedaaCola #KeedaaColaCast #Brahmanandam pic.twitter.com/4Ozf1jJhLD
— Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) June 19, 2023
కాగా ఈసినిమాలో మొత్తంగా 8 ప్రధాన పాత్రలు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమాను ఈఏడాది రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ ను త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: