కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 8

megastar chiranjeevi interesting comments on venkatesh
సినిమా వార్తలు

వెంకటేశ్‌ తో ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలి

అగ్రహీరో వెంకటేష్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా సైంధవ్. ఈసినిమా వెంకీ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో చాలా కాలం తరువాత మళ్లీ వెంకీ మాస్ రోల్ తో రాబోతుండటంతో సినిమాపై మొదటినుండీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో శ్రద్ద శ్రీనాథ్, ఆండ్రియా, నమాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ కూడా పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Game Changer New Schedule Update
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ షురూ

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ravi teja mr bachchan movie shoot begins
షూటింగ్ అప్‌డేట్

రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా త్వరలో ఈగల్ అంటూ రాబోతున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అంతేకాదు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్…

TFN Adminవాట్సాప్
Pranay Reddy Vanga Interesting Comments On Spirit Movie
సినిమా వార్తలు

స్పిరిట్- ప్రభాస్ రోల్ పై ప్రణయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Vijaykanth's Demise Megastar, Jr. NTR and Other Celebs Share Condolences
సినిమా వార్తలు

విజయ్ కాంత్‌ మృతి.. మెగాస్టార్, ఎన్టీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం

కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది కాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తొలుత నవంబర్‌ 18న చెన్నైలోని మియోట్‌ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చేరారు. కొన్నిరోజుల చికిత్స అనంతరం విజయ్ కాంత్‌ కోలుకుని డిసెంబర్‌ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే రెండు వారాలు గడువకముందే మళ్ళీ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో కోవిడ్‌ సోకినట్లు తేలింది. దీని కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే క్రమంగా…

Srikanth Mవాట్సాప్
prabhas salaar movie joins in 500 crore club
సినిమా వార్తలు

500 కోట్ల క్లబ్ లో సలార్

బాహుబలి సిరీస్ తో తన సత్తాను ప్రపంచానికిి తెలియచేశాడు ప్రభాస్. ఆసిరీస్ తో ప్రభాస్ రేంజ్ కూడా మారిపోయింది. ఇక బాహుబలి తరువాత ప్రభాస్ సాహో, ఆదిపురుష్ సినిమాలతో వచ్చాడు కానీ ఆ సినిమాలు అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయాయి. అయితే ఇప్పుడు సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

TFN Adminవాట్సాప్
lokesh kanagaraj clarity on leo 2
సినిమా వార్తలు

లియో 2 కన్ఫామ్ చేసిన లోకేష్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
Actor-politician Vijayakanth Passed Away
సినిమా వార్తలు

కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్ మృతి

కోలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్ కాంత్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇటీవల కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో విజయ్ కాంత్‌కు కొవిడ్‌ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ కాంత్‌ పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Sricharan Pakala Reveals Interesting Facts About Bubblegum
సినిమా వార్తలు

బబుల్‌గమ్‌లో రోషన్ ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ అందరినీ ఫిదా చేస్తుంది - శ్రీ చరణ్ పాకాల

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బబుల్‌గమ్'. మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
talented cinematographer kishor kumar on board for Varun Tej Matka movie
సినిమా వార్తలు

మట్కా కోసం టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈమధ్యనే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే పలు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
kalyan ram devil movie completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న డెవిల్

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్, వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అన్ని అప్ డేట్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం. అంతేకాదు సెన్సార్ సభ్యుల నుండి…

TFN Adminవాట్సాప్
Interesting Clash Between Ram Charan and Suriya
సినిమా వార్తలు

రామ్‌ చరణ్‌ vs సూర్య ఇంట్రెస్టింగ్ ఫైట్

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మధ్య త్వరలో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగనుంది. అయితే ఇది సినిమాల పరంగా కాదు.. క్రికెట్ పరంగా. అవును మీరు విన్నది నిజమే. ఇటీవలే రామ్‌ చరణ్‌ ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐఎస్‌పీఎల్‌)లో హైదరాబాద్‌ జట్టును కొనుగోలు చేసి క్రీడా రంగంలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, గల్లీ క్రికెట్‌ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వెంచర్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చరణ్ పేర్కొన్నాడు.

Srikanth Mవాట్సాప్
nani saripodhaa sanivaaram movie shoot update
షూటింగ్ అప్‌డేట్

సరిపోదా శనివారం లెంగ్తీ షెడ్యూల్ హైద్రాబాద్‌లో ప్రారంభం

ఈఏడాది రెండు సినిమాలతో అలరించిన నాని ప్రస్తుతం కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు.

TFN Adminవాట్సాప్
eagle second single gallanthe song out now
సాంగ్

ఈగల్ నుండి మెస్మరైజింగ్ గల్లంతే సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఈగల్. గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో ఈసినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం. మరోవైపు ఈసినిమా పొంగల్ బరిలో దిగనుంది. ఈనేపథ్యంలో రిలీజ్ కు ఎక్కువ రోజులు లేకపోవడంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
sudheer babu praises on prabhas salaar movie
సినిమా వార్తలు

సలార్ పై సుధీర్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. వాళ్లు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాలో ప్రభాస్ మాస్ జాతరను చూపించాడు. అంతేకాదు తమ హీరోను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలా ఈసినిమాలో ఉండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రభాస్ యాక్టింగ్, మాస్ అవతార్, యాక్షన్ సీక్వెన్స్, ప్రశాంత్ నీల్ మేకింగ్ అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్
Salaar Action Promo Out Now
సినిమా వార్తలు

సలార్‌ యాక్ష‌న్ ప్రోమో రిలీజ్.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న ప్రభాస్‌ ఎలివేషన్స్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘సలార్‌’. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలున్న ఈ చిత్రం దానికి తగ్గట్లే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ప్రభాస్ కటౌట్‌కి సరిగ్గా సరిపోయే సినిమా ఇదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం రూ. 500 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
SAINDHAV 3rd Single BujjiKondave song release date fixed
సాంగ్

సైంధవ్- హార్ట్ టచింగ్ బుజ్జి కొండవే సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
ravi teja voice over for teja sajjas hanuman movie
సినిమా వార్తలు

హనుమాన్ కోసం మాస్ మహారాజా

వచ్చే ఏడాది పొంగల్ రేసులో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ సినిమా కూడా ఒకటి. తేజ సజ్జా ఈసినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా సూప‌ర్ హీరో క‌థాంశంతో మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానుంది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
kalyan ram sharing interesting facts on devara movie
సినిమా వార్తలు

దేవర ఒక విజువల్ వండర్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

TFN Adminవాట్సాప్
Devil Like be Sherlock Holmes Type Movie, Says Nandamuri Kalyan Ram
సినిమా వార్తలు

డెవిల్.. షెర్లాక్ హోమ్స్ తరహా సినిమా - నందమూరి కళ్యాణ్ రామ్

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా గురించి పలు విషయాలు మీడియాతో మాట్లాడారు.

Srikanth Mవాట్సాప్

షేర్