గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మధ్య త్వరలో ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగనుంది. అయితే ఇది సినిమాల పరంగా కాదు.. క్రికెట్ పరంగా. అవును మీరు విన్నది నిజమే. ఇటీవలే రామ్ చరణ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్)లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేసి క్రీడా రంగంలోకి ఎంటరైన సంగతి తెలిసిందే. సమాజ స్ఫూర్తిని పెంపొందించడానికి, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించడానికి, గల్లీ క్రికెట్ సంస్కృతిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ వెంచర్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చరణ్ పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ తమిళ నటుడు సూర్య చెన్నై జట్టును కొనుగోలు చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల జట్ల మధ్య మైదానంలో ఆసక్తికర పోరు జరుగనుంది. ఐపీఎల్‌లో షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగినప్పుడు వారు గ్రౌండ్‌లో కనిపించి అభిమానులను అలరించడం గుర్తుండే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ సౌత్ సూపర్ స్టార్స్ టీమ్స్ తలపడినప్పుడు వారి జట్లకు మద్దతుగా ఈ హీరోల ఫ్యాన్స్ స్టేడియంలో సందడి చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరితోపాటు మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ లీగ్‌లో భాగం కానున్నారు.
కాగా మన దేశంలోని ప్రతిభావంతమైన స్థానిక క్రికెటర్లను వెలుగులోకి తేవడం కోసం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ పేరుతో టీ10 ఫార్మాట్‌లో జరిగే టెన్నిస్ క్రికెట్ లీగ్ ఆరంభిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా మరియు శ్రీనగర్ జట్లు పోటీపడుతున్నాయి. ఇక ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ముంబై, అక్షయ్ కుమార్ శ్రీనగర్, హృతిక్ రోషన్ బెంగళూరు జట్లను కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ముంబై వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ జరగనుంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు సూర్య శివ దర్శకత్వంలో వైవిధ్యభరితంగా తెరకెక్కుతోన్న ‘కంగువ’ అనే హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్ మూవీలో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: