గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్ షురూ

Game Changer New Schedule Update

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో రీసెంట్ గానే షూట్ కు బ్రేక్ ఇచ్చారు మేకర్స్. అయితే తాజాగా మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు చిత్రబృందం. హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ మొదలైంది. శ్రీకాంత్‌, సముద్రఖని, ఎస్‌జే సూర్య ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. రామ్ చరణ్ త్వరలోనే ఈ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడట.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఈసినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.