హనుమాన్ కోసం మాస్ మహారాజా

ravi teja voice over for teja sajjas hanuman movie

వచ్చే ఏడాది పొంగల్ రేసులో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్ సినిమా కూడా ఒకటి. తేజ సజ్జా ఈసినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈసినిమా సూప‌ర్ హీరో క‌థాంశంతో మైథ‌లాజిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానుంది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్ర‌కు ర‌వితేజ వాయిస్ ఇచ్చాడు. ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఈ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. ఈవిష‌యాన్ని చిత్రయూనిట్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. ర‌వితేజ మైక్ ముందు డ‌బ్బింగ్ చెబుతోన్న ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. కాగా గతంలో కూడా రవితేజ ప్రశాంత్ వర్మ డెబ్యూ మూవీ అయిన అ మూవీ కోసం తన వాయిస్ ఓవర్ ను అందించాడు.

కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.