కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది కాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తొలుత నవంబర్ 18న చెన్నైలోని మియోట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేరారు. కొన్నిరోజుల చికిత్స అనంతరం విజయ్ కాంత్ కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే రెండు వారాలు గడువకముందే మళ్ళీ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు తేలింది. దీని కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే క్రమంగా పరిస్థితి విషమించి విజయ్ కాంత్ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తమిళనాట అగ్ర నటుడిగా, రాజకీయ నేతగా గుర్తింపు పొందిన విజయ్ కాంత్ మృతి పట్ల యావత్ తమిళ ప్రజలు, ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కూడా విజయ్ కాంత్ మృతి పట్ల స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, విష్ణు మంచు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నటులు విజయ్ కాంత్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు విజయ్ కాంత్ మృతికి సంతాపంగా తమిళనాడులోని అన్ని థియేటర్లలో ఈరోజు మార్నింగ్ షోలను రద్దు చేశారు. కెప్టెన్ మనల్ని విడిచి వెళ్లిన నేపథ్యంలో సంతాపంగా మార్నింగ్ షో రద్దు చేశామని, అయితే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి యథావిధిగా రెగ్యులర్ షోలు ఉంటాయని థియేటర్ల సంఘం ప్రకటించింది.
Heartbroken to know that our ‘Puratchi Kalingar’, ‘Captain’ Vijayakanth is no more. He was a wonderful human being, Hero of the Masses,a multi faceted personality and an astute politician. Though he never acted in straight Telugu films, he is hugely popular and loved by the… pic.twitter.com/r0N4olxFrL
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023
Saddened to learn about Vijayakanth Garu’s passing. A true powerhouse in both cinema and politics. May his soul find eternal peace. My thoughts are with his family and friends.
— Jr NTR (@tarak9999) December 28, 2023
Disheartening to know about the demise of #Vijayakanth Garu, May his family find solace in the memories of his impactful life 🙏
— Ravi Teja (@RaviTeja_offl) December 28, 2023
Saddened at the demise of #Vijaykanth Garu, towering personality on-screen & off-screen.
Strength & condolences to his loved ones.
May his soul rest in peace.
Om Shanti 🙏— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 28, 2023
Deeply saddened by the news of Vijayakanth garu’s passing. His legacy in cinema and politics will be remembered. May his soul rest in peace. Heartfelt condolences to his loved ones.
— Venkatesh Daggubati (@VenkyMama) December 28, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: