రవితేజ మిస్టర్ బచ్చన్ షూటింగ్ ప్రారంభం

ravi teja mr bachchan movie shoot begins

మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా త్వరలో ఈగల్ అంటూ రాబోతున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాను పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అంతేకాదు మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. ఇక తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా షూటింగ్ ను నేటి నుండి మొదలుపెట్టినట్టు అధికారికంగా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by RAVI TEJA (@raviteja_2628)

కాగా ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.