కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్ మృతి

Actor-politician Vijayakanth Passed Away

కోలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయ్ కాంత్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇటీవల కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో విజయ్ కాంత్‌కు కొవిడ్‌ సోకినట్లుగా నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి కూడా ఆయన ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ కాంత్‌ పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విజయ్ కాంత్ మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులు మియోట్ ఆసుపత్రికి చేరుకున్నారు. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు మియోట్ ఆసుపత్రి వద్ద భద్రత పెంచారు. కాగా విజయ్ కాంత్ 1952 ఆగస్ట్ 25న మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. సినిమాలపై మక్కువతో చెన్నై చేరుకొని విజయ్ కాంత్‌గా పేరు మార్చుకుని ప్రయత్నాలు ఆరంభించారు. ఈ క్రమంలో 27 ఏళ్ల వయస్సులో తొలిసారిగా 1979లో ‘ఇనిక్కుం ఇలామై’ అనే సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొత్తం 150కి పైగా చిత్రాల్లో నటించారు.

అయితే ఆయన నటించిన 100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ ఘనవిజయం సాధించినప్పటినుంచి అందరూ ఆయనను కెప్టెన్‌గా సంబోధించడం ప్రారంభించారు. ఇక విజయ్ కాంత్ తన సుదీర్ఘ కెరీర్ లో కేవలం తమిళ చిత్రాల్లోనే నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి విజయం సాధించాయి. అనంతరం రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఆయన 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పార్టీని స్థాపించారు. ఈ క్రమంలో 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు ఆయన పార్టీ 39 స్థానాలు కైవసం చేసుకుంది. 2011లో తమిళనాట అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. కాగా విజయ్ కాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.