లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. లోకేష్ మేకింగ్, విజయ్ యాక్టింగ్ ముఖ్యంగా అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందన్న ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ ను లియో సీక్వెల్ గురించి అడుగగా.. తలైవా 171, ఖైదీ 2 సినిమాల తర్వాత లియో 2 సెట్స్‌పైకి వెళ్తుందని చెప్పాడు. ఇక లోకేష్ ఇచ్చిన క్లారిటీతో ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్
కాగా ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ పలు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేశారు. ఈసినిమా ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: