నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్, వరుసగా పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అన్ని అప్ డేట్లు కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం. అంతేకాదు సెన్సార్ సభ్యుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Censor rating for DEVIL is U/A 🙂 2 hour 26 minutes 25 seconds is the Runtime 🙂 #DevilTheMovie Releasing on DECEMBER 29TH 2023@NANDAMURIKALYAN #Devil #DevilonDec29th pic.twitter.com/LN6v29Aozo
— ABHISHEK PICTURES (@AbhishekPicture) December 27, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































