మాస్ మహారాజా నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఈగల్. గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో ఈసినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం. మరోవైపు ఈసినిమా పొంగల్ బరిలో దిగనుంది. ఈనేపథ్యంలో రిలీజ్ కు ఎక్కువ రోజులు లేకపోవడంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలోభాగంగానే ఇప్పుడు ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేయడానికి వచ్చేశారు. ఇప్పటికే ఆడు మచ్చా అంటూ వచ్చే ఫస్ట్ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ బీట్ తో ఉన్న ఈపాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. గల్లంతే అనే సోల్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.
The mesmerizing melody #Gallanthe 💞 is here to weave its magic into your hearts! ❤️😍#EAGLE 🦅 2nd single OUT NOW 🎼🎧 – https://t.co/v9Daup2DPJ
🎤 @KapilKapilan_ #Lynn
✍️ @kk_lyricist
A @davzandrockz Musical 🎹@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg… pic.twitter.com/NPb2zbvF2S— People Media Factory (@peoplemediafcy) December 27, 2023
కాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: