ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్ మేన్ సినిమా కూడా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో 2012లో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈసినిమాలో మహేష్ యాక్టింగ్ లోని మరో కోణాన్ని చూపించాడు పూరీ. అందుకే వన్ మ్యాన్ షో లాగ మహేష్ బాబు యాక్టింగ్, ఆయన యాటిట్యూడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అప్పట్లోనే ఈసినిమా 90 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి నిర్మాతలకు లాభాలను అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆగష్ట్ 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈసినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అడ్వాన్స్ బుకింగ్స్ ను చూస్తే అర్థమవుతుంది. ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను అలా ఓపెన్ చేశారో లేదో ఇలా నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయి సెన్సేషనల్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక రికార్డును క్రియేట్ చేసుకుంది ఈసినిమా. ఒక్క హైద్రాబాద్ లోనే కోటి అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంత చేసుకున్న మొదటి ఫాస్టెస్ట్ సినిమాగా ఈసినిమా కొత్త రికార్డును సొంతం చేసుకుంది. మరి రీ రిలీజ్ కు కూడా ఈరేంజ్ లో బుకింగ్ జరుగుతుందంటే మాములు విషయం కాదు.. మరి కలెక్షన్స్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
Superstar Is Unrivalled 🤘❤️🔥
Businessman Is Now The First, Fastest & Only Film To Cross 1Cr Advance Bookings Gross In Hyderabad City Alone [ BMS ] ⭐️💥
Mr. Tollywood Mahesh’s Stardom On Duty ❤️🔥#GunturKaaram #Businessman4K @urstrulyMahesh pic.twitter.com/u1PeaTXHQ4
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 7, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: