విభిన్నమైన కథలు, సినిమాలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన సినిమాతో వచ్చేస్తున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. గతకొంతకాలంగా ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా నుండి విక్రమ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మాళవిక మోహనన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నేను మాళవిక పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ చూస్తుంటే గిరిజన మహిళగా మాళవిక నటించనున్నట్టు అర్థమవుతుంది. మాళవిక మోహనన్ లుక్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది.
A powerful and modern force redefining herself 🔥
Wishing the fierce and fabulous @MalavikaM_ a wonderful birthday 💖
Here’s to a year filled with strength, talent, and empowerment!#HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/ZYHkH3aQrH— Studio Green (@StudioGreen2) August 4, 2023
కాగా పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలను ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: