25 కోట్లపై సమంత కౌంటర్

samantha solid counter about taking 25 crore from a hero

ఎంత సైలెంట్ గా ఉన్నా కొంతమంది హీరోయిన్స్ పై ఏదో ఒక రూమర్ తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు సమంత పై కూడా అలాంటి ఒక రూమరే చక్కర్లు కొడుతుంది. మరి సమంత గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా కౌంటర్ ఇవ్వడంలో కానీ.. తను అనుకున్నది ఎలాంటి మొహమాాటం లేకుండా ధైర్యంగా బయటకు చెప్పడంలో కానీ ఎక్పర్ట్. ఈనేపథ్యంలోనే తనపై వచ్చిన రూమర్ కు సాలిడ్ కౌంటర్ ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంతకీ తనపై వచ్చిన రూమర్ ఏంటంటే.. సమంత తనకు వచ్చిన మయోసైటిస్ చికిత్స కోసం ఓ హీరో దగ్గర 25కోట్లు తీసుకున్నట్టు వార్తులు తెరపైకి వచ్చింది. దీనిపై సమంత స్పందిస్తూ.. మయోసైటిస్ కోసం 25కోట్లా..? ఎవరో మీకు రాంగ్ ఇన్పర్మేషన్ ఇచ్చారు.. అయితే ట్రీట్ మెంట్ కోసం నేను చాలా తక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది.. ఇంతకాలం నేను చేసిన హార్డ్ వర్క్ కు డబ్బులే సంపాదించాను అనుకుంటున్నాను రాళ్లు కాదు.. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను థాంక్యూ. మయోసైటిస్ వల్ల చాలా మంది బాధపడుతున్నారు.. అలాంటి సమాచారం ఇచ్చేముందు కాస్త బాధ్యత వహించండి అంటూ పోస్ట్ లో పేర్కొంది. మరి సమంత ఇచ్చిన క్లారిటీతో రూమర్స్ కు బ్రేక్ పడుతుందేమో చూద్దాం…

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. ఇంకా సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా రీసెంట్ గా పూర్తి చేసుకుంది సమంత.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.