వారితో నటించడంతో నా కల నెరవేరింది

tammannah bhatia sharing interesting comments about bholaa shankar movie

మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ఇచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు విడుదలౌతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ?
చాలా ఆనందంగా వుంది. రెండు సినిమాలు అన్నీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్. వారితో కలసి నటించడంతో నా కల నెరవేరినట్లయింది.

భోళా శంకర్, జైలర్ చిత్రాలలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
భోళా శంకర్, వేదాళంకు రీమేక్. ఐతే మెహర్ రమేష్ గారు చాలా మార్పులు చేశారు. నా పాత్ర కొత్తగా వుంటుంది. నిజానికి నా పాత్ర ఒరిజినల్ లో అంత ఉండదు. ఇందులో చాలా డిఫరెంట్ గా క్యారెక్టరైజేషన్ వుంటుంది. జైలర్ విషయానికి వస్తే.. అందులో స్మాల్ పార్ట్ లో కనిపిస్తా. క్యారెక్టర్ పరంగా రెండూ డిఫరెంట్ సినిమాలు. ఆడియో పరంగా జైలర్ లో కావలయ్య పాట చాలా మందికి రీచ్ అయ్యింది. భోళా శంకర్ లో నాది ఫుల్ లెంత్ రోల్. ఈ సినిమాతో చాలా అసోసియేషన్ వుంది.

సైరాలో చిరంజీవిగారితో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు కదా.. భోళా శంకర్ తో ఆ లోటు తీరిందా ?
అవును. పాట పేరు కూడా మిల్కీ బ్యూటీ అని పెట్టారు. రియల్లీ క్యూట్. చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం రావడం చాలా అదృష్టం. డ్యాన్స్ లో ఇప్పుడు వాడుతున్న చాలా స్టయిల్స్ ఆయన దగ్గర నుంచే వచ్చాయి. భోళా శంకర్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.

చిరంజీవి గారితో డ్యాన్స్ అంటే ఎలా రిహార్సల్ చేశారు ?
మిల్కీ బేబీ పాట రొమాంటిక్ మెలోడి. ఒక హుక్ స్టెప్ వుంటుంది. అలాగే చాలా గ్రేస్ ఫుల్ మూమెంట్స్ వుంటాయి. స్విజ్జర్లాండ్ లో చాలా బ్యూటీఫుల్ గా షూట్ చేశాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 4 =