నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. రొటీన్ కాన్సెప్ట్ లకు ఫుల్ స్టాప్ పెట్టి విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేథ్యంలోనే గత ఏడాది బింబిసార లాంటి సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఇక ఈ ఏడాది అమిగోస్ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడు కళ్యాణ్ రామ్. అయితే ఈసినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది కానీ అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డెవిల్. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఈసినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. కళ్యాణ్ రామ్ లుక్, విజువల్స్ అన్నీ ఆకట్టుకొని సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్ కు తీసుకెళ్లాయి. అంతేకాదు ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. హిందీ గ్లింప్స్ కూడా తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. నవంబర్ 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Meet the #Devil On Nov 24! pic.twitter.com/lBFUxDPAwI
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) August 6, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: